అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ఒంగోలు,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఒంగోలులోని రామ్‌నగర్‌, మామిడిపాలెం, కర్నూలు రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌ పరిశీలించారు. ఆయా కాలనీల్లో చేపట్టాల్సిన రహదారులు, మురుగు కాల్వల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంట నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకట కృష్ణ, మున్సిపల్‌ ఇంజినీర్‌ సుందరరామిరెడ్డి, నగర తెదేపా అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు