అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట సీఎం కేసీఆర్.
– ప్రభుత్వ విప్ రేగా ఆదేశాలతో… – ప్రభుత్వ విప్ రేగా ఆదేశాలతో…
– అను నిత్యం ప్రజల కోసం: జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్ నవంబర్ 08 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో 11వ రోజు అనునిత్యం ప్రజలకు కొరకు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని మసీదు రోడ్డు, సుదరయ్య నగర్ కాలనీ లో ఉదయం 6 గంటల నుంచి జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత విస్తృతంగా పర్యటించారు. త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు ప్రజలు జెడ్పిటిసి దృష్టికి తీసుకువెళ్లారు. జడ్పిటిసి సత్వరమే సమస్యలను త్వరగారితిన పూర్తి చేయాలని అధికారులను ఆమె కోరారు. పినపాక నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. నియోజవర్గంలో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను విప్ రేగా కృషితో కోట్లాది రూపాయల నిధులు మంజూరు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. వారి సహకారంతో అనేక గ్రామాలకు సిసి రోడ్లు, బీటి రోడ్ల నిర్మాణం, కల్వర్టులు, బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, అన్ని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్తు కాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతుబంధు, రైతు బీమా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా లాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలితా కుమారి, సారపాక టౌన్ అధ్యక్షులు కునకంచి శ్రీను, మెహన్ రావు, మండల కార్మిక విభాగము మర్రి సాంబిరెడ్డి, విరంరెడ్డి సతీష్, బాలి శ్రీహరి, తిరుపతి ఏసోబు, సట్టు అంజనేయులు , బిఆర్ స్ పార్టీ నాయకులు బెజ్జంకి కనకా చారి, బిక్షపతి, నక్క రమాదేవి, చుక్కపల్లి బాలాజీ, , సాయిబాబు, సందీప్ పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.