అమరవీరుల సమస్యలు పట్టించుకోరి కెసిఆర్‌: రేవంత్‌

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): తెలంగాణలో ప్రజలకు భరోసా కల్పించేందుకే టిడిపి అధినేత చంద్రబాబు వచ్చారని తెలంగాణ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపుర్‌ సభలో మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో 1200 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని, వారి వల్లే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా సీఎం కేసీఆర్‌ వెళ్లట్లేదని ఆరోపించారు. కనీసం వారిని ఇప్పటికీ గుర్తించలేదన్నారు.  అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హావిూ ఇచ్చారని, ఇచ్చిన హావిూలను ఇంతవరకూ ప్రభుత్వం అమలు చేయలేదని రేవంత్‌ ఆరోపించారు. ఇప్పటికీ అమరవీరుల జాబితా కూడా ప్రభుత్వం వద్ద లేదన్నారు. వారికోసం ప్రభుత్వం కనీసం ఒక స్తూపం కూడా నిర్మించలేదన్నారు. రైతుల రక్తంలోంచి పుట్టిన పార్టీ తెదేపా అని రేవంత్‌ పేర్కొన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ట్యాంక్‌బండ్‌పై అమరవీరులకు స్తూపం కట్టితీరుతామని ఆయన స్పష్టంచేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలుగుదేశం సీనియర్‌ నేత నర్సిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలలు సాకారమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎనిమిది నెలల పరిపాలన చూస్తుంటే తెలంగాణ ప్రజలు పెనం విూద నుంచి పొయ్యిపై పడ్డారనిపిస్తోందని నర్సిరెడ్డి విమర్శించారు. తెలంగాణలో వర్షాలు పడటం లేదు కానీ కేసీఆర్‌ ఇస్తున్న హావిూల వర్షం వరదలా పొంగుతోందని నర్సిరెడ్డి ధ్వజమెత్తారు. ఫోర్త్‌ ఎస్టేట్‌గా ప్రజల మన్ననలందుకుంటున్న విూడియాను టీ. సెక్రటేరియట్‌లోకి ప్రవేశించకుండా ఎందుకు నిషేధించారని ఆయన ప్రశ్నించారు. టీ.సర్కారు అవినీతిని విూడియా బైట పెడుతుందనే ఆందోళనతోనే విూడియాను కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిచారు.