అమరవీరుల స్ఫూర్తితో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి..
– సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మద్దూర్ మండలం వీర బైరాన్ పళ్లి అమరవీరుల సంస్మరణ సభకు చేర్యాల నుండి వెళ్లే బైకు ర్యాలీని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం నిర్వహించాలని పోరాటాల ద్వారానే ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు ఇబ్బందులు దూరం అవుతాయని అన్నారు. నేడు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దీనికి పోరాటమే మార్గమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు, పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు నక్కల యాదవ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, సందబోయిన ఎల్లయ్య, జి.భాస్కర్, శెట్టి పళ్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట మావో, బండకింది అరుణ్ కుమార్, రాళ్లబండి నాగరాజు, బద్దిపడగ కృష్ణారెడ్డి, చెరుకు రమణారెడ్డి, తాడూరి రవీందర్, మోకు దేవేందర్ రెడ్డి, గొర్రె శ్రీనివాస్, పొనుగోటి శ్రీనివాస్ రెడ్డి, కత్తుల భాస్కర్ రెడ్డి, ఎన్ కనకయ్య, ఎండి కరీం, రేపాక కుమార్, దర్శనం రమేష్, స్వర్గం శ్రీకాంత్, పోలోజు శ్రీహరి, ప్రభాకర్, రాళ్ల బండి భాస్కర్, బోయిని మల్లేశం, అత్తిని శారద, ఇప్పకాయల శోభ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|