అమరావతిని ప్రపంచంలోనే నెం.1.. 

బుద్ధిస్ట్‌ అట్రాక్షన్‌ ప్లేస్‌గా మర్చేందుకు కృషి
– అసెంబ్లీలో ఏపీ టూరిజం మంత్రి అఖిల ప్రియ
అమరావతి, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించని బుద్ధిజంను కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే ఇందుకు సంబంధించిన అన్నీ సైట్స్‌ గుర్తించి అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన అఖిల.. బుద్ధిజంను ప్రమోట్‌ చేయడానికి పెద్ద స్థాయిలో ఈవెంట్స్‌ కూడా క్రియేట్‌ చేశామన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఈవెంట్‌కు రెండు వేల మంది సన్యాసులు మనదేశం నుంచే కాకుండా ఇతరత్రా దేశాలు నుంచి రావడం జరిగిందన్నారు. మన అమరావతిని వరల్డ్‌లోనే నంబర్‌ వన్‌ బుద్ధిస్ట్‌ అట్రాక్షన్‌ ప్లేస్‌గా మార్చాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ‘మహాయాణ బుద్ధి సర్కిస్ట్‌’ కింద కేంద్రానికి ప్రపోజల్స్‌ పెట్టామన్నారు. ఇందుకు స్పందించిన కేంద్రం రూ. 52కోట్లు
నిధులివ్వడం జరిగిందని.. అందులో అమరావతికి మాత్రమే రూ.21 కోట్లు నిధులు కేటాయించామని అఖిల అసెంబ్లీలో వివరించారు. టూరిజం శాఖ నుంచి ఇప్పుడున్న బడ్జెట్‌లో ఎంతవరకైతే చూసుకోగలమో అంతవరకూ అన్నీ చేస్తున్నామని .. కేంద్రం మరిన్ని నిధులిస్తే టూరిజం కింద ఇంకా చాలా డెవలప్‌మెంట్స్‌ చేసి చూపిస్తామని మంత్రి అఖిల అసెంబ్లీ వేదికగా వివరించారు.

తాజావార్తలు