అమరావతి ఉద్యమానికి రాజకీయ మద్దతు

రైతులకు అండగా నిలుస్తామన్న నేతలు
ప్రతి ఒక్కరూ ముందుకురావాలని దేవినేని పిలుపు
సిఎం జగన్‌ మనసు మార్చుకోవాలన్న రామకృష్ణ
అమరావతి,నవంబర్‌1(జనంసాక్షి) : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అంటూ… రైతులు, మహిళలు సోమవారం ఉదయం మహా పాదయాత్ర చేపట్టగా పలు పార్టీల నుంచి భారీ మద్దతు వస్తోంది. ఈ పాదయాత్ర.. తుళ్లూరు నుంచి తిరుమల వరకు మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. రోజుకి 14 కిలో విూటర్లు ఈ పాదయాత్ర చేస్తారు. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరిట ఈ పాదయాత్ర చేపట్టారు. సోమవారం రాత్రికి తుళ్లూరు నుంచి పరిమి విూదుగా తాడికొండకు పాదయాత్ర చేరుకోనుంది. గుంటూరు జిల్లాలో 6 రోజులు ఈ పాదయాత్ర కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల విూదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. టిడిపి తరపున ఆ పార్టీ సీనియర్‌ నేతలు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నేతలు తెనాలి శ్రవణ్‌కుమార్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టిడిపి నేతలు తెలిపారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 34 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారని ట్విటర్‌ వేదికగా దేవినేని ఉమ పేర్కొన్నారు. అమరావతి కోసం చేస్తున్న 685 రోజుల సుదీర్ఘ పోరాటానికి కొనసాగింపుగా చేపట్టిన ’న్యాయస్థానం`దేవస్థానం’ మహా పాదయాత్ర విజయవంతం కావాలని.. అమరాతి రాజధానిగా కొనసాగాలని కోరుకుంటూ.. రైతుల పాదయాత్రకు సంఫీుభావం తెలుపుదాం‘ అని దేవినేని ఉమ పేర్కొన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో
ఉన్నప్పుడు ఇక్కడే గృహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, వైకాపా నాయకులు ప్రచారం చేసుకున్నారని… అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రైతుల్ని మోసం చేశారని విమర్శించారు. బీజేపీ కూడా స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని, ద్వంద్వ ప్రమాణాలు మాని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరను వ్యతిరేకించడాన్ని ఆహ్వానిస్తున్నామ న్నారు. 37 మంది ఎంపీలు ఉన్నా.. ప్రధాని వద్దకు వెళ్లి అర్జీ ఇవ్వలేని చేతకాని వారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని, ఆల్‌ పార్టీ విూటింగ్‌ పెట్టి, ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోరారు. ఒంటరి అయ్యానని పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడటం సరి కాదన్నారు. అన్ని రంగాల వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, సీఎం జగన్‌ ఆల్‌ పార్టీ విూటింగ్‌ పెట్టకపోతే.. పవన్‌ కళ్యాణ్‌ చొరవ తీసుకుని అల్‌ పార్టీ విూటింగ్‌ పెట్టి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని రామకృష్ణ సూచించారు.