అమరావతి కోసం చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణ

వ్యాపార దిగ్గజాలతో నిరంతర సంప్రదింపులు

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు

అమరావతి,జూలై21(జ‌నం సాక్షి): అమరావతిని త్వరగా నిర్మించడంతో పాటు ప్రపంచస్థాయి సంస్థలను ఇక్కడికి తీసుకుని రావడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో విజయంసాధించడమే లక్ష్యంగా ఎపి సిఎం చంద్రబాబు కార్యక్రమాలు సాగుతున్నాయి. వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో ఆ ప్రభావం పడినా, కేంద్ర సాయం అంతంమాత్రంగానే ఉన్నా బాబు తనకున్న పరిచయాలతో వ్యవహారాలు సాగిస్తున్నారు. అందుకే అనేక అంతర్జాతీయ సంస్థలకు అవసరమైతే ఉచితంగా భూమి కట్టబడెతానని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా అమరావతికి బ్రాండ్‌ ఇమేజ్‌ కోసమేనని వేరుగా చెప్పక్కరలేదు. ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు చంద్రబాబుకు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సిఎంగా ఉన్న సమయంలో ఆయన ఐటి రంగ విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు విడివడ్డ ఎపికి సిఎంగా ఆయన మరోమారు ప్రపంచ వ్యప్తంగా పేరు మార్మోగుతోంది. అలాగే ప్రపంచంలో ఉన్న ఐటి దిగ్గజాలు లేదా పారిశ్రామికవేత్తలు కూడా కొత్త కాదు. అందుకే చంద్రబాబు పెట్టుబడులే లక్ష్యంగా ఇప్పటికే అనేక దేశాల్లో పర్యటన కొనసాసాగించారు. ఆయన ప్రయత్నాలకు సానుకూలత కూడా కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించకుండా ప్రపంచంలో ఏ ఆధునిక నగరమూ ప్రగతిని సాధించలేదని తరచూ చెబుతున్నారు. రాష్ట్రంలో పట్టణాల సుందరీకరణ నుంచి రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరిస్తున్న వినూత్న ప్రణాళికలను ఆయన పదేపదే వివిధ దేశ ప్రతినిధులకు వివరించారు. ఐవోటీని పాలన కోసం వినియోగిస్తున్నామంటూ కోర్‌ డ్యాష్‌ బోర్డుపై సభికులకు పరిచయం చేస్తున్నారు. రియల్‌టైం సర్వర్‌ రక్షణకు సైబర్‌ సెక్యూరిటీ కల్పించనున్నట్లు చెప్పారు. ఈ-ప్రగతి ద్వారా రాష్ట్రంలో 745

పౌర సేవలు లభిస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతుల నుంచి పన్నుల చెల్లింపుల వరకు ఇప్పుడు ఏపీలో అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించే నగరాల నమూనాల ప్రణాళిక అంతా విజన్‌-2029కి అనుగుణంగా ఉంటుందన్నారు. ఆధార్‌ అనుసంధానంతో దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థను సంపూర్ణంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చంద్రబాబు ప్రకటించారు. ఐటీలో మా వాళ్లకు పట్టుంది. నైపుణ్యం మాకున్న అదనపు బలంఅని తెలిపారు. దేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, ప్రపంచ కుబేరులు, కార్పొరేట్‌, బహుళజాతి సంస్థల అధినేతలూ, సీఈవోలందరినీ చంద్రబాబు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో భారతదేశం 60 స్థానంలో ఉండటమూ, 15వస్థానంలో ఉన్న చైనాను పక్కనబెట్టినా, పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కంటే దిగువున ఉండటమూ మన విధానాల డొల్లతనాన్ని తెలియ చెబుతున్నది. ఆర్థిక కార్యకలాపాల్లో కార్మికవర్గ భాగస్వామ్యం తక్కువగా ఉండటమూ, వారి పనిపరిస్థితులు, ప్రయోజనాలు, ఉద్యోగభద్రత మెరుగ్గా లేకపోవడం, అసంఘటితరంగం పాత్ర ఇత్యాది కారణాలను ఈ నివేదిక ఏకరువుపెట్టింది. ఆర్థికవ్యవస్థ బాగున్నదంటే దానర్థం ప్రజలందరూ బాగున్నట్టు కాదు. సంపద అసమానత్వం భారతదేశంలో ప్రపంచసగటు కంటే అధికంగా ఉన్నది. ప్రపంచస్థాయిలో అయితే 8మంది చేతిలోనే 58శాతం సంపద ఉన్నది. భారతదేశ సంపదలో 58శాతం కేవలం ఒక్కశాతం సంపన్నుల దగ్గర తిష్టవేసింది. ఈ దశలో చంద్రబాబు పరిస్తితులను తనకు అనుకూలంగా చేసుకుంటున్నారు. అమరావతి చుట్టూ అభివృద్దిని చూపుతూ పెట్టుబడుల ఆకర్శణకు అనేక విధాలుగా యత్నిస్తున్నారు.

 

తాజావార్తలు