అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలను నిర్మించాలి 

మసూరి సైదులు సంతాప సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్
గరిడేపల్లి, జులై 30 (జనం సాక్షి): మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు గా వర్కర్స్ సమస్యలపై నిరంతరం పోరాడి అమరుడు అయిన కామ్రేడ్ మసూరి సైదులు ఆశయ సాధనకు మనందరం కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన మసూరి సైదులు సంతాప సభకు ముఖ్య అతిదిగా హజరైన ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం రాష్ట్రములో అధికారం లో వున్న పాలక బీజేపీ తెరాస పార్టీలు కార్మిక వ్యతిరేక పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహారిస్తూ కార్మికులు పోరాడి సాధించిన హక్కులను కూడా రద్దు చేస్తున్నారని మన హక్కులను మనం సాధించుకోవడానికి ఐక్య ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉండన్నారు.కామ్రేడ్ మసూరి సైదులు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ  అధ్యక్షులుగా వున్నపుడు ఏఐటీయూసీ కార్యాలయం నిర్మించడం అభినందించదగ్గ విషయం అన్నారు.అంతకుముందు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సంతాప సభకుబిల్డింగ్ వర్కర్స్జి యూనియన్ ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్ స్వాగతోపన్యాసం చేయగా ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జెట్టి ప్రసాద్ సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, మట్టంపల్లి మండల సిపిఐ కార్యదర్శి అమరారపు పున్నయ్య, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కీసర నాగయ్య  బిల్డింగ్
 వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి నందిపాటి వినోద్, పెద్ద మస్తాన్, ఆనందరావు, తిరపయ్య, వెంకటేశ్వర్లు, వీరయ్య, పిచ్చయ్య, గణేష్,  రవి, మైసయ్య, రవి, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.