అమెరికా విదేశాంగ మంత్రిగా భారతీయురాలు..??

nikki-trump-split-zoom-7480ddca-95e6-42a8-aab2-605d8bed37d2అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ నియమితమయ్యే అవకాశాలున్నాయంటూ కధనాలు జోరుగా సాగుతున్నాయి. రెండు సార్లు దక్షిణ కరోలినా గవర్నర్‌గా పనిచేసి తన సమర్థతను చాటుకున్న నిక్కి హేలీ కొత్త అధ్యక్షుడ్ని కలుసుకోనున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి పదవి ఆమెకు ఖాయమన్న వాదనకు మరింత బలం చేకూరింది. ఈ పదవి కాకపోయినా ట్రంప్ పాలనా యంత్రాంగంలో నిక్కీకి ఏ మంత్రి పదవి లభించినా అది భారతీయులందరికీ గర్వకారణం. రిపబ్లికన్ పార్టీలో ఇటీవలి కాలంలో అత్యిధిక జనాదరణను నిక్కీ పార్టీ గవర్నర్ల సంఘం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎప్పుడో అమృతసర్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన సిక్కుల సంతతికి చెందిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ రణధవా హేలీ.