అమ్మాపురం సర్పంచ్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

బేడ బుడగ జంగాల సంఘం నాయకులు కిన్నెర తులసీరాం,శివాజీ.
తొర్రూరు 27 జూన్( జనంసాక్షి )
మండలంలోని అమ్మాపురం సర్పంచ్ కడెం యాకయ్య పై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలని,లేదంటే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని,బేడ బుడగ జంగాల సంఘం నాయకులు కిన్నెర తులసీరాం,శివాజీ లు హెచ్చరించారు.ఎంపీటీసీ-1 డోనుక ఉప్పలయ్య ఆధ్వర్యంలో బేడ బుడగ జంగాల నాయకులు సోమవారం మండలంలోని అమ్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ను కలిసి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో సర్పంచ్ గా గెలుపొంది,పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిత్యం శ్రమిస్తూ.అన్ని కుల సంఘాలు,యువజన సంఘాలు,మహిళల మన్ననలు పొందుతున్నారనే ఉద్దేశ్యంతో ఓర్వలేక సర్పంచ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.ఇప్పటికైనా పద్దతి మార్చుకొని గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  బేడ బుడగ జంగాల సంఘం నాయకులు కల్యాణి,శ్రీనివాస్,సిరిపాటి రాజేంద్ర,గంధం సాయి,శివ,భరత్,శ్యామ్,శ్రీను,వెంకన్న తదితరులు పాల్గొన్నారు