అమ్మా పురం లో అధికార దుర్వినియోగం

 కలెక్టర్ పాల్గొన్న సమావేశానికి ఎంపీటీసీ ని ఆహ్వానించని గ్రామ పాలకులు
తొర్రూరు:23 జూన్ (జనంసాక్షి )
అధికారిక కార్యక్రమాల్లో గ్రామ ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం ఆనవాయితీ.  కానీ దానికి తిలోదకాలిస్తూ మండలంలోని అమ్మపురం గ్రామ పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.అధికారిక పార్టీ కానీ వారిని ఆహ్వానించ కూడదనే దురుద్దేశంతో స్వయాన గ్రామ ఎంపీటీసీ నే అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించలేదు.
గురువారం మండలంలోని అమ్మపురం గ్రామంలో సామూహిక శ్రీమంత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శశాంక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో  స్థానిక ప్రజా ప్రతినిధులను విధిగా ఆహ్వానించాలి.
కానీ దానికి విరుద్ధంగా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు
ఎంపీటీసీ ముద్దం విక్రమ్ రెడ్డి ని విస్మరించారు.  సభాస్థలి పై సర్పంచ్ మినహా గ్రామ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ప్రజల అభిమానాలను చూరగొన్న ముద్దం విక్రమ్ రెడ్డి లాంటి ఎంపీటీసీని ఉద్దేశపూర్వకంగానే సభా వేదిక పైకి ఆహ్వానించలేదని స్థానికులు బహిరంగంగానే చర్చించుకున్నారు.గతంలోనూ అనేక కార్యక్రమాల్లో ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి ని ఆహ్వానించకుండా అవమానించారు.  అయినా  ప్రజల కోసం అవేమీ పట్టించుకోకుండా ఎంపీటీసీ పని చేశారు.
ప్రజాప్రతినిధిని అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్న గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ముద్దం  విక్రమ్ రెడ్డి వివరణ కోరగా.
అధికారిక ప్రారంభోత్సవాలకు సంబంధించిన కార్యక్రమంలో తనకు ఆహ్వానం అందలేదని,
గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా తనను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు.  ఈ ఘటనపై జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.