అర్థచాతుర్మాస్య దీక్ష విరమణకు మంత్రి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం

వనపర్తి బ్యూరో సెప్టెంబర్26 (జనంసాక్షి)

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతకోట శ్రీ వీరభద్ర సమేత శివకేశవ ఆలయంలో జులై 3 నుండి ప్రారంభమై 90 రోజులు కొనసాగిన అర్థచాతుర్మాస్య దీక్ష విరమణ మహా పూర్ణాహుతి కార్యక్రమం ఈనెల 30 నా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డినీ ఆహ్వానిస్తూ సోమవారం రాత్రి మంత్రి క్యాంపు కార్యాలయంలో తిరుపతి తీర్థనందస్వామి శ్రీ వెంకట్ చరణ్ స్వామి పూరి సురేష్ శెట్టి లు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పూరి సురేష్ శెట్టి మాట్లాడుతూ,, పాతకోట వీరభద్ర స్వామి ఆలయంలో జూలై మూడున ప్రారంభించిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముగింపు కార్యక్రమాలకు సిద్ధమయ్యామని తెలిపారు. పురాతనమైన ఆలయాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి పూర్వవైభవం తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశమని సురేష్ శెట్టి తెలిపారు దీనిలో భాగంగానే చరిత్ర కలిగిన పాత కూడా శ్రీ వీరభద్ర శివకేశవ ఆలయాన్ని ఎంపిక చేసుకొని 90 రోజులపాటు నిత్య పూజ హోమం రుద్రాభిషేకాలు నిర్వహించి దిగ్విజయంగా కొనసాగేందుకు సహకరించిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పూరి సురేష్ శెట్టి, ఆలయ కోశాధికారి జంగిడి ఈశ్వరమ్మ, బుచ్చమ్మ పాల్గొన్నారు.