అర్ధరాత్రి ఆడోళ్లకి ఏం పని !
బొత్స వంకరటింకర మాటలు
హైదరాబాద్, డిసెంబర్ 24 (జనంసాక్షి): ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఖండించారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని మహి ళలు బయట తిరగడం ఎంతవరకు సమం జసమని ఆయన ప్రశ్నించారు. పరిస్థితులను అర్థం చేసుకుని మహిళలు రాత్రివేళల్లో బయట తిరగకపోవడమే మంచిదని అన్నారు. ముఖ్యంగా ప్రైవేటు బస్సుల్లో తిరగడం సరికాదని అన్నారు. అయితే ఢిల్లీలో ఈ ఘటన జరగడం దారుణమని ఆయన అన్నారు. ప్రజల రక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని అన్నారు. అర్థరాత్రి వేళల్లో తిరిగే ముందు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఢిల్లీ ఘటన చిన్నదైననూ సోనియాగాంధీ వంటి నేత స్పందించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ సమర్థిం చడం లేదని పూర్తిగా ఖండిస్తోందని అన్నారు. ముఖ్యంగా టిఆర్‌ఎస్ అధినేత తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యల భావాలను తాను తప్పు పట్టడం లేదని భాషే సరిగా లేదని విమర్శించారు. ముఖ్యంగా ఉద్యమకారులు వాడే భాష సక్రమంగా ఉండాలని అన్నారు. ఉద్యమనాయకులు సంస్కారాన్ని పాటించాలని అడ్డూ.. అదుపు లేకుండా వ్యాఖ్యలు చేస్తే ఉద్యమ నేతలకే నష్టమని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ సమస్యను కాంగ్రెస్ పార్టీ పరిష్క రిస్తుందని అన్నా రు. అయితేతెలంగాణ పై నిర్ణయం తీసుకో వడంలో ఆలస్యం జరగడం సరికాదని అన్నారు. ఈ నెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమా వేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పాల్గొనేదీ ఈ నెల 27 నిర్ణయిస్తామని అన్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదా వరి జిల్లాల్లో పార్టీ ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు బొత్స తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 7న విజయవాడలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు బొత్స తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాంనబీ ఆజాద్, ఏఐసిసి కార్యదర్శి కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహతోపాటు మంత్రులు పాల్గొటారని బొత్స తెలిపారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలో పేతం చేసేందుకై ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో టిడిపి నేతలు చేసిన హంగా మాను ఆయన తప్పుపట్టారు. మంత్రి కాసు కృష్ణారెడ్డి ఇంట్లో లేని సమయంలో టిడిపి నాయ కులు, కార్యకర్తలు ఆయన ఇంటిలోకి ఎందుకు వచ్చారని బొత్స ప్రశ్నించారు. ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టిడిపి గోడవ సృష్టిస్తోందని అన్నారు. టిడిపి నేతలు భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కాంగ్రెస్‌పార్టీ చూస్తూ ఊరుకోబోదని బొత్స హెచ్చ రించారు. సహకార సంఘాల ఎన్నికలను ప్రభు త్వం శాంతియుతంగా నిర్వహిస్తుందని బొత్స తెలిపారు.