అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతుల వీరంగం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రెయిన్‌ పబ్‌లో యువతులు తప్పతాగి అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ దృష్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఓ ఛానల్‌ ప్రతినిధిపై దాడి చేశారు. గతంలో అనుమతి రద్దు చేసిన నిర్వాహులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తున్నారు.

రోజూ తెల్లవారుజాము వరకూ పబ్‌కు నిర్వహిస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారు. మామూళ్లు తీసుకుని అనధికారికంగా పోలీసులు పబ్‌లకు అనుమతి ఇస్తున్నారని సమాచారం. దీంతో పుల్లుగా మందుకొట్టిన యువతులు అర్ధరాత్రి హంగామా చేశారు. రోడ్డుపై న్యూసెన్స్‌ ఏంటని ప్రశ్నించిన మీడియాపై చిందులు తోక్కుతూ తిట్ట పురాణం అందుకున్నారు.