అర్ధశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతులు
స్టాక్¬ం,అక్టోబర్ 10(జనంసాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. బ్రిటన్‌కు చెందిన ఒలీవర్ హర్ట్, ఫిన్‌లాండ్‌కు చెందిన బెంగ్ట్ హాల్మ్‌స్టామ్ర్‌లకు సంయుక్తంగా ఈ బహుమతిని అందజేయనున్నారు. ‘కాంట్రాక్ట్ థియరీ’పై వీరు చేసిన పరిశోధనలకుగాను ఈ పురస్కారం అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ఒప్పందం సిద్ధాంతం (కాంట్రాక్ట్ థియరీ) రూపొందించిన ఇద్దరూ ఆర్థిక నోబెల్ ను పంచుకోనున్నారు. ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు అందించిన సూత్రాలతో కాంట్రాక్టులు, వ్యవస్థలను అర్థం చేసుకోవడం సులువు అవుతుందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. వీళ్లు ప్రతిపాదించిన సూత్రాలు కాంట్రాక్టు డిజైన్‌లో ఉన్న లోపాలను కూడా ఎత్తిచూపుతాయని రాయల్ స్వీడిష్ అకాడవిూ పేర్కొంది.