అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

– సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 126,110లో గల ప్రభుత్వ భూమిలో కుడకుడ , కోమటికుంట లోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఏఓకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుడకుడ రెవిన్యూ శివారులో గల ప్రభుత్వ భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు,భూస్వాములు ఆక్రమిస్తూ వ్యాపారం చేస్తున్నారని అన్నారు.గతంలో ఎప్పుడో 50 ఏళ్ల కింద ఇచ్చిన ఇండ్లు తప్ప ఇప్పటివరకు పేదలకు ఇండ్లు గానీ ఇళ్ల స్థలాలు గానీ ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.కుడకుడ చుట్టూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.గతంలో అనేకసార్లు పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే పాలకులు,అధికారులు పట్టించుకోలేదన్నారు.వెంటనే  కుడకుడ, కోమటికుంట లోని అర్హులైన పేదలందరినీ గుర్తించి సర్వేనెంబర్ 126,110 లలో ప్రతి ఒక్కరికి 120 గజాల వరకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కోట గోపి , చినపంగి నర్సయ్య , వీరబోయిన రవి , కంచుగట్ల శ్రీనివాస్, పిండిగ నాగమణి, ఎల్లమ్మ , సైదమ్మ , స్వాతి , సోమలక్ష్మి , ఎల్లమ్మ , రేణుక , సరిత, చంద్రమ్మ , అనిత , ఇమ్రాన్, షరీఫ్, కుమారి తదితరులు పాల్గొన్నారు.