అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
*తెలంగాణ సంస్కృతి, జాతీయ సమైక్యత,దేశ భక్తి చాటేలా దూం దాం గా విద్యార్థులు,కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు
*స్వాతంత్ర్య సమర యోధులు, కళాకారులకు సన్మానం
నల్గొండ బ్యూరో,జనం సాక్షి: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ సంస్కృతి,జాతీయ సమైక్యత,దేశ భక్తి ని చాటేలా కళా కారులు,విద్యార్థినీ,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధూం.. దాంగా సాగాయి. కళాకారులు, విద్యార్థినీ,విద్యార్థులు ప్రదర్శనలను ఆద్యంతం తిలకించిన ముఖ్య అతిథులు, ఆహుతులు,పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలు కరతాళధ్వనులతో అభినందించారు. స్వాతంత్ర్య సమరయోధులు, కళాకారులను ఘనంగా సన్మానించారు.ముఖ్య అతిథులు గా హాజరైన
హాజరైన జడ్ పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,భాస్కర్ రావు,ఎస్.పి. రె మా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ,భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి,జడ్.పి.వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చిందు యక్షగానం,, దేశ భక్తి గేయాలు,నృత్యాలు నాటికలు తెలంగాణ గేయాలతో కళాకారులు ఆహుతులను ఉర్రూతలూగించగా, జాతీయ సమైక్యత,స్వాతంత్ర్య స్ఫూర్తిని విద్యార్థులు నాటికలు ప్రదర్శనలతో కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి అలరింపజేశారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సాంస్కృతిక ప్రదర్శనలను అతిథులు, పెద్ద సంఖ్యలో హాజరైన ఆహుతులు పూర్తిగా లీనమై ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో తిలకించారు.
ఈ సందర్భంగా జడ్.పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో అంతర్భాగమై 75వ సంవత్సరంలోకి అడుగిడిన శుభతరుణాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోందన్నారు.1947,ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైద్రాబాద్ సంస్థానం లో నిజాం రాజు భారత్ లో విలీనం కాకుండా స్వతంత్రం గా ప్రకటించుకున్నార ని అన్నారు .ఆనాటి నైజాం పాలనలో భూస్వాముల వేధింపులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం,సర్దార్ పటేల్ పోలీస్ చర్య కారణంగా సెప్టెంబర్ 17,1948 న హైద్రాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిందని అన్నారు.మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి న తర్వాత తెలంగాణ ప్రాంతం ను 1956 లో ఆంధ్ర ప్రదేశ్ లో బలవంతంగా కలుపుకున్నారని,రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు నాయకత్వంలో ఆనాడు శాంతి యుతంగా సాగిన తెలంగాణ ఉద్యమం తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని రాష్ట్రం అభివృద్ది పథం లో పయనిస్తోందని అన్నారు.ఆనాటి పోరాట యోధులు,సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,భాస్కర్ రావు లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ననుసరించి ఈ నెల 16 ఉత్సవాల ప్రారంభం సందర్భంగా చేపట్టిన సమైక్యతా ర్యాలీల్లో ప్రతీ సెగ్మెంట్లో సగటున 15 వేల మంది చొప్పున అన్ని వర్గాల వారు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీల్లో భాగస్వాములై జాతీయ భావాన్ని చాటారని అన్నారు. .ఈ 17, 18వ తేదీలలో కొనసాగిన కార్యక్రమాలు కూడా ఎంతో గొప్పగా జరిగాయని, మనమంతా భారతీయులం.. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని ప్రజలు చాటారని వారు అన్నారు
65 సంవత్సరాల సమైక్య పాలనలో అణిచివేతకు గురైన తెలంగాణను స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనింపజేస్తూ యావత్ దేశానికే తలమానికంలా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. విద్యుత్ వినియోగం, సాగు నీరు, ఇంటింటికి రక్షిత మంచినీరు, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనలో తెలంగాణ ప్రాంతమంతా అభివృద్ధిని సంతరించుకుంటోందని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్.పి. రె మా రాజేశ్వరి లు మాట్లాడుతూ తెలంగాణ సమాజంతో కళలకు విడదీయరాని బంధం ఉందని, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో కళలు మమేకం అయి ఉన్నాయని అన్నారు. దీనిని గుర్తెరిగిన ప్రభుత్వం ఇటీవలే నిర్వహించుకున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో, ప్రస్తుతం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లోనూ కవులు, కళాకారులకు గుర్తింపు దక్కేలా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో గడిచిన మూడు రోజుల నుండి చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ స్థాయిలో విజయవంతం చేశారని అన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని వర్గాల వారు భాగస్వాములై జాతీయ భావం పెంపొందించారని అన్నారు
ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమర యోధులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.