అల్లా మాఫ్ కర్నా : ఇవే కసబ్ చివరి మాటలు
హైదరాబాద్ : తనను ఉరికంభం వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఉగ్రవాది అజ్మల్ కసబ్ కాస్తా కదిలిపోయినట్లు కనిపించాడు. అల్లా మాఫ్ కర్నా ఐసి గల్తీ దుబారా నహీ హోగీ (దేవుడా, క్షమించు. ఈ పోరపాటు మళ్లీ జరగదు. అని అన్నాడు. కసబ్ చివరి మాటలు ఇవే పూణేలోని ఎరువాడ జైలులో ఉరికంభం వద్దకు తీసుకుని వెళ్లినప్పుడు అతను అన్న చివరి మాటలు ఇవే. వైద్యడు, వైద్య బృదం, జైలు , జిల్లా అధికారుల సమక్షంలో కసబ్‌ను బుధవారం ఉదయం ఉరీతీశారు. ఉరి తీసేటప్పుడు.కసబ్ ఏ మాత్రం ప్రతిఘటించలేదని తెలుస్తోంది. ముంబై అర్డర్ రోడ్డు జైలు నుంచి మంగళవారం తెల్లవారు జామున ఎరవాడ జైలుకు తరలించారు. స్పెషల్ కమెండోలతో కూడిన అరు వాహనాలు అనుసరిస్తుండగా కసబ్‌ను ముంబై పూణే ఎక్సప్రెస్ వే మీదుగా తరలించారు. కసబ్నఉ తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు యెరవాడ జైలుకు తీసుకుని వచ్చారు. అతని శారీరక దార్డ్యాన్ని పరీక్షించారు. అతను 52.5 కిలోలు తూగినట్టు చెబుతున్నారు. రక్తప్రసరణ సాదారణ స్థితిలో 120’90 ఉన్నట్లు ద్రువీకరించుకున్నారు. జైలు మానసిక నిపుణుడు కసబ్ మానసిక స్థితిని పరీక్షించాడు.కసబ్ అతీ మాములుగా కనిపించాడని వైద్యుడు వేసిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చాడని అంటున్నారు. అందోళనకు గురైనట్లు కసబ్ కనిపించలేదని సమాచారం. జైలులోని ఖైదీలందరిని హైసెక్యురిటీ అండా సెల్‌లోకి మార్చి కసబ్‌ను ప్రత్యేక సెల్‌లో ఉంచినట్లు చెబుతున్నారు. ఫాన్సీ యార్టుకు తీసుకుని.వెళ్లే ఖైదీలను ఉంచే సెల్‌లో అతన్ని ఉంచారు. బుధవారం ఉరి తీస్తున్నట్లు అధికారులు మంగళవారం సాయంత్రం కసబ్‌కు చెప్పారు. అది విన్న తర్వాత కూడా కసబ్ చలించలేదని కూల్‌గా కనివించాడని అంటున్నారు. పాటలు పాడాలని సమాచారం.