అవన్నీ అబద్ధాలు, అపనిందలు: వాద్రా
న్యూఢిల్లీ: పౌర సమాజ నేత అరవింద కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యాలపై రాబర్ట్ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత రెండో రోజులుగా సోనియా కుటుంబం, వాద్రాపై వస్తున్న విమర్శిలపై ఎదురుదాడికి దిగారు. ప్రచారం కోసమే కొందరు సోనియా కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేసి లబ్థి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్థాలు, అపనిందలని అన్నారు. గత 21 ఏళ్లగా చట్టాలకు లోబడే తాను వ్యాపారం చేస్తున్నట్లు తెలియజేశారు.