అవయవ దానానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలి

– అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చుతాం

– 1.20లక్షల మంది ముందుకొచ్చి రికార్డు నమోదు చేశారు

– అవయవ దానానికి అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తాం

– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు పిలుపుతో అవయవదానానికి 1.20 లక్షల మంది అంగీకారం తెలిపారు. ఉండవల్లిలో అంగీకారపత్రాలను జీవన్‌దాస్‌ సంస్థకు చంద్రబాబు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవ దానం పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని చెప్పారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అవయవదానం ఒక షరతు గా పెట్టె అంశాన్ని పరిశీలిస్తామని, అవయవ దానం పై అందరు చర్చించాలని, అవయవ దానం దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా భారీగా దాతలను నమోదు చేయించాలని సీఎం పిలుపునిచ్చారు. నా ఆర్గాన్స్‌ను డోనేట్‌ చేయడానికి నేను ముందుకు వస్తున్నానని, ఆర్గాన్‌ డోనేషన్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. జీవన్‌ మిత్ర పేరుతో పెద్ద ఎత్తున సాధికార మిత్రలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, లక్షా 20 వేల మంది ఆర్గన్‌ డోనేషన్‌కు ముందుకు వచ్చి రికార్డు క్రియేట్‌ చేశారన్నారు. అవయవదాతలు ఇంత పెద్ద ఎత్తున ముందుకు రావడం ఇదే ప్రథమం అని చంద్రబాబు అన్నారు. మెప్మాలో పనిచేసే వారి ఆదాయాన్ని 10వేలకు మించేలా ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అనంతరం స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మాట్లాడుతూ.. అవయవాల దానం గురించి విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అవయవ దానం కార్యక్రమానికి జీవన మిత్ర అనే వ్యవస్థ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలని, అవయవ దాతలకు నగదు రూపంలోనే కాకుండా ఇతరత్రా ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా రెండు గంటలు చర్చ జరగాలని కోడెల పేర్కొన్నారు.

 

తాజావార్తలు