అవసరాలు ఆసరాగా వ్యభిచారం

ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు
విజయవాడ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అమాయక అమ్మాయిల అవసరాలే లక్ష్యంగా యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.   టూ టౌన్‌, సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. మధురానగర్‌లోని వివి నరసారావు రోడ్డులో బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులను తీసుకొచ్చి ఒక ఇంటిని అ/-దదెకు తీసుకొని వ్యభిచారం చేయిస్తున్నాడు. కొత్తపేట శిల్పారామం వీధిలో చల్లా జ్యోతి అనే మహిళ విజయవాడ నగరంతో పాటు గుంటూరు నుంచి ముగ్గురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం రొంపిలోకి దింపింది. జక్కంపూడి కాలనీకి చెందిన సయ్యద్‌ యాస్మిన్‌ భవానీపురానికి చెందిన యువతిని తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపాడు. ఆర్ధిక ఇబ్బందులు, డబ్బు ఆశ చూపించి ఈ యువతులను ఈ వృత్తిలోకి దింపారని పోలీసులు నిర్దారించారు. మొత్తం 8 మంది యువతులను సంరక్షించి ముగ్గురు నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7,400 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వ్యభిచార గృహాలకు నగరం అడ్డాగా మారుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తులు యువతుల శరీరాలను అందుకు మార్గంగా వాడుకుంటున్నారు. మాయ మాటలతో ఉపాధిని కలలుగా చూపించి వారి జీవితాలను కల్లోలం చేస్తున్నారు. విజయవాడ నగర పోలీసులు, సీఐడీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి.

తాజావార్తలు