అవినీతికి కేరాఫ్‌ జగన్‌: గంటా

విశాఖపట్నం,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి): అవినీతికి జగన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి శుక్రవారం ఎందుకు కోర్టుకెళ్తున్నారో జగన్‌ చెప్పాలని ప్రశ్నించారు. ¬దా, రైల్వే జోన్‌, రాఫెల్‌ స్కాంపై జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. జగన్‌ ఇచ్చిన హావిూలను అమలు చేయాలంటే దేశ బ్జడెట్‌ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. అరకు ఘటన దురదృష్టకరమని, సీఎం ఎల్లుండి విశాఖ వస్తున్నారని మంత్రి గంటా తెలిపారు.

తాజావార్తలు