అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు: శతృఘ్ను సిన్హా

న్యూఢిల్లీ,జూలై19(అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు: శతృఘ్ను సిన్హా): కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత నరేంద్రమోదీ సర్కార్‌ తొలిసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొనబోతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో శుక్రవారం నిర్వహించే ఓటింగ్‌లో తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తానని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హా తెలిపారు. బీజేపీ

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాలను బహిరంగంగానే విమర్శలు చేయడంతో పాటు ఎన్‌డీఏ పాలనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే రోజున బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని విప్‌ కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం లోక్‌సభలో స్పీకర్‌ను మినహాయిస్తే ఎన్‌డీఏ సంఖ్య బలం 314. అధికార బీజేపీకి 273 మంది సభ్యుల బలం ఉంది. కొంతమంది ఎంపీలు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుండగా ఒక ఎంపీ విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు అంశాలపై సభలో చర్చించనున్నారు. అనంతరం అవిశ్వాసంపై ఓటింగ్‌ నిర్వహించనున్నారు.