అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించటం.. 

టీడీపీ సాధించిన విజయం
– అనంత్‌కుమార్‌ వ్యాఖలు వెకిలిగా ఉన్నాయి
– ఏపీ మంత్రి నారాయణ
అమరావతి, జులై18(జ‌నం సాక్షి) : లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ చర్చకు స్వీకరించడం టీడీపీ సాధించిన విజయమని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడారు. పాలకు పాల.. నీళ్లకు నీళ్లు విడదీసి చెబుతామని అనంత్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వెకిలిగా ఉన్నాయన్నారు. ఆ పనేంటో లోక్‌సభలో టీడీపీ చేసి చూపిస్తుందని తెలిపారు. అవిశ్వాసంపై చర్చలో టీడీపీకి తక్కువ సమయం ఇచ్చినా భావసారూప్యం ఉన్న మిగతా పార్టీల సాయం తీసుకుంటామని
మంత్రి నారాయణ అన్నారు. బీజేపీ, వైసీపీ వైఖరిని లోక్‌సభ సాక్షిగా ఎండగడతామని తెలిపారు. బీజేపీ మద్దతుతోనే విభజన బిల్లు ఆమోదంపొందిందని గుర్తుచేశారు. విభజన హావిూలనే అమలు చేయాలని తాము కోరుతున్నామని అన్నారు. విజయసాయిరెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాదని, ఏపీకి ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఆ విధంగా ముందుకు సాగాలన్నారు. అలాంటప్పుడే ప్రజల్లో పార్టీ పట్ల, నేతల పట్ల గౌరవం ఉంటుందని, అలా కాకుండా వైకాపా ఆడినట్లు డ్రామాలాడితే ప్రజలు తరిమికొడతారని నారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని వారి కుట్రలకు సహకరించే వైకాపా, జనసేనలను ప్రజలు తరికొడతారని నారాయణ హెచ్చరించారు.

తాజావార్తలు