అశ్విన్ దెబ్బకు కుప్పకూలిన లంక.. 183 పరుగులకే ఆలౌట్

d4iq35h1గాలే, ఆగస్టు 12 : శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య జట్టు భారత స్పిన్నర్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడింది. అశ్విన్ అద్భుతంగా రాణించడంతో లంక 183 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో మాథ్యూస్ 64, చండిమాల్ 59 పరుగులతో రాణించి లంక పరువుని కాపాడారు. మిగిలిన వారందరూ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. భారత్ బౌలర్లలో అశ్విన్ 6, మిశ్రా 2, ఇషాంత్, ఆరోన్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా, అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు 14 పరుగుల వద్ద ఓపెనర్ లోకేశ్ రాహూల్ వికెట్‌ను కోల్పోయింది