అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయండి

ఏలూరు,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): పాఠశాలకు వచ్చే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మహిళ కానిస్టేబుల్‌ కె.రమాదేవి తెలిపారు. తాళ్లపూడి ఉన్నత పాఠశాలలో ఈవ్‌ టీజింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. రమాదేవి మాట్లాడుతూ.. పాఠశాలకు వచ్చే విద్యార్థులను ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అయితే పాఠశాల విద్యార్థులందరూ చదువుపై దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమణమూర్తి, కానిస్టేబుల్‌ శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజావార్తలు