అసమానతలు తొలగించడం అంత తొందరగా కాదు : ప్రధాని

న్యూఢిల్లీ : పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఇంకా కృషి చేస్తుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఫిక్కీ సదస్సును ప్రధాని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అసమానతలు రాత్రికి రాత్రే తొలగించడం అసాధ్యమని  చెప్పారు. మితిమీరిన నిరాశావాదమే అభివృధ్ధికి ఆటంకమని తెలిపారు. 2008లో భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్లో మందగమనం మనదేశంపై ప్రభావాన్ని చూపించాయని పేర్కొన్నారు. అమెరికా, చైనాల ఆర్థిక వృద్ధిరేటు ఇంకా మందగమనంలోనే ఉందని అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.