అసెంబ్లీలో జెండా ఎగురేసిన స్పీకర్, మండలి ఛైర్మన్
అమరావతి,ఆగస్ట్15(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి ఆవరణలో ఛైర్మన్ ఫరూక్ , శాసనసభ ఆవరణలో సభాపతి కోడెల జాతీయ జెండా ఎగురవేశారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని… త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల వరసలో భారత్ ఉంటుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అమరావతిలో నాలుగోసారి స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్టాన్రికి అనేక సమస్యలు ఉన్నా…సంక్షేమం, అభివృద్ధిలో ముందుంటున్నామని…. కేంద్రం నుంచి సహకారం లేదనే బాధ మాత్రం ఉందని వ్యాఖ్యానించారు. పోలవరం రాష్టాన్రికి జీవనాడి అని అన్నారు. 72 ఏళ్లుగా దేశం ఎంతో ప్రగతి సాధించిందని మండలి ఛైర్మన్ ఫరూక్ అన్నారు. పోలవరం లేకపోతే రాయలసీమ పరిస్థితి దారుణంగా ఉండేదన్న ఆయన…., రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.