అసెంబ్లీలో రౌడీలకు సీట్లు ఇవ్వాలేమో

nepg57zxనారాయణ సంచలన వ్యాఖ్య
ఖమ్మం,మార్చి9(జ‌నంసాక్షి): సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండే సీపీఐ రాష్ట్ర నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే రాబోయే రోజుల్లో సీట్లు రౌడీలు..గూండాలు..మల్లయోధులకే ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రౌడీల రాజ్యం నడుస్తున్నట్టుగా ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో రౌడీల రాజ్యం నడుస్తున్నట్టుగా ఉందని సీపీఐ రాష్ట్ర నేత నారాయణ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఖమ్మం జిల్లా నుంచే ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. అసెంబ్లీలో సభ్యుల వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. ఇక్కడ జరుగుతన్న సిపిఐ సభల్లో ఆయన మాట్లాడారు. గతంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు బెంచీలు ఎక్కి గవర్నర్‌ను కొట్టబోయారని, ఇప్పుడు టీడీపీ సభ్యులు బెంచీలు ఎక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ బాటలోనే టీడీపీ నడిచిందన్నారు. ఇకముందు అసెంబ్లీ సీట్లు రౌడీలు, గూండాలు, మల్లయోధులకు ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇక వామపక్ష పార్టీల ఏకీకరణ విషయంపై సీపీఐ ప్రతిపాదనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వ్యాఖ్యలు సరికావని నారాయణ అన్నారు. జాతీయ స్థాయిలో ఐక్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ లాంటి శక్తులు ఇంకా తీవ్రస్థాయిలో వాయిస్తేనే తమకు బుద్ధి వస్తుందన్నారు. నక్సలైట్ల సహా అన్ని వామపక్ష పార్టీలు ఏకీకృతం కావాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా నుంచే ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభిస్తామని తెలిపారు. అసెంబ్లీలో సభ్యుల వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు.  నక్సలైట్ల సహా అన్ని వామపక్ష పార్టీలు ఏకీకృతం కావాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.