అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా నేతల భేటీ

మెదక్‌ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన మెదక్‌ జిల్లా అలీఖాన్‌పల్లిలో తెదేపా నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం సక్రమంగా ఖర్చు పెట్టాలని భేటీ అనంతరం పార్టీ నేత మోత్కుపల్లి అన్నారు.