అసోం పర్యటనకు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ: అసోంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కోక్రాఝూర్ జిల్లాలో పర్యటనకు ప్రధాని మన్మోహన్‌సింగ్ బయలుదేరివెళ్లారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటుచేశారు. బోడోలకు, మైనారీటీ వలసదారులకు మధ్య వారం క్రితం కోక్రఝూర్ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలు మరో మూడు జిల్లాలకు వ్యాపించి హింసకు దారితీశాయి. ఈ హింసాకాండలో ఇప్పటివరకూ 44 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 2 లక్షల మందిని ప్రభుత్వ పునరావస శిబిరాలకు తరలించారు.