అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్న నేతలు

చర్చల్లో వాగ్బాణాలే ప్రధానం కానున్నాయి

బలాబలాల బేరీజు ముఖ్యం కాబోదు

నేటి అవిశ్వాస చర్చలో పరస్పర దూషణలకే ప్రాధాన్యం

న్యూఢిల్లీ,జూలై19(జ‌నం సాక్షి): వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజే సంచలనం నమోదైంది. మోదీ ప్రభుత్వంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను స్పీకర్‌ పరిగణనలోకి తీసుకోవడంతో శుక్రవారం దీనిపై చర్చ చేపట్టనున్నారు. ప్రస్తు పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న లక్ష్యం కూడా విపక్షాల్లో లేదు. అయితే పార్లమెంట్‌ వేదికగా ఆయా రాజకీయ పార్టీలు తమ వాదనలతో రాజకీయ ఉపన్యాసాలకు తెరలేపే అవకాశాలు ఉన్నాయి. అధికార బిజెపిని తూర్పారా పట్టేందుకు విపక్ష పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. శుక్రవారం నుంచి పార్లమెంటులో ఇదే దర్శనం కాబోతుంది. అవిశ్వాసంపై సరిపడా మద్దతు లభించడంతో శుక్రవారం చర్చ చేపట్టాలని నిర్ణయించారు.మరోవైపు బీజేపీ కూడా తమ ఎంపీలకు విప్‌ జారీ చేయడంతో శుక్రవారం లోక్‌సభలో ఏం జరగబోతోందనే దానికి పెద్దగా ఆసక్తి లేదు. బీజేపీకి ఎంత సమయం కేటాయిస్తారు? ఇతర పార్టీలకు ఎంత సమయం కేటాయిస్తారన్నది బలాబలాల ఆధారంగా స్పీకర్‌ నిర్ణయిస్తారు. అవిశ్వాసం నోటీస్‌ ఇచ్చిన టీడీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోందనడానికి పెద్దగా లెక్కలు వేయాల్సిన అవసరం లేదు. కేవలం విభజన హావిూలపై మోడీ సర్కార్‌ యూ టర్న్‌ తీసుకున్నదనే విషయాన్ని గట్టిగా ప్రస్తావించనుంది. విపక్షాల ప్రశ్నలకు ముఖ్యంగా విభజన హావిూల అంశానికి, అలాగే ¬దాపై కేంద్రం వద్ద గట్టి సమాధానం ఉంటుందనడంలో

సందేభం లేదు. సభలో ఏం సమాధానం చెబుతుందనే కన్నా ధీటుగానే బదులివ్వడానికి బిజెపి శ్రేణులు సిద్దంగా ఉన్నాయి. హావిూలు అమలు చేయని కేంద్రాన్ని పార్లమెంట్‌ సాక్షిగా విపక్షాలు దోషిగా నిలబెట్టడంలో టిడిపికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వస్తుందనడంలో సందేహం లేదు.విభజన హావిూలను ఎండగట్టడం ద్వారా సమయాన్ని సద్వినయోగం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంది. అలాగే దేవంలో మోడీ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్దపడుతోంది. బడ్జెట్‌ సమావేశాల్లో అన్నాడీఎంకేని అడ్డంపెట్టుకుని వాయిదాల విూద వాయిదాలు వేసి తప్పించుకున్న బీజేపీ .. వర్షాకాలం సమావేశాల్లో అనూహ్యంగా మొదటి రోజే అవిశ్వాస తీర్మానం తీసుకోవడం వెనక బీజేపీ వ్యూహంఉంది. విపక్షాలను ఎండగట్టడానికి ప్రధానంగా కాంగ్రెస్‌ను ఎండగట్టడానికి లోక్‌సభను వేదికగా చేసుకునే అవకాశం ఉంది.

కర్ణాటక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అలాగే ఇప్పుడు టిడిపిపైనా బిజెపి విమర్వలు గుప్పించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇక్కడ బలాబలాల కన్నా వాగ్బాణాలే ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

———–