అహంకారానికి తప్పదు పరాభవం


ఇది చరిత్రలో జరిగిన సత్యం
అవహేళన కేంద్రానికి నూకలు చెల్లినట్లే
వడ్ల కొనుగోళ్లపై కేంద్రం దిగిరాకుంటే తడాఖా చూపుతాం
ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం
ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా తెలంగాణకు అవమానాలు
నూకలు తినమంటూ పీయూష్‌ గోయల్‌ వెక్కిరింపు వ్యవహారాలు
తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం
విూడియా సమావేశంలో మంత్రులు వెల్లడి
హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):ధాన్యంసేకరణలో కేంద్రం సానుకూల నిర్ణయం తసీఉకోకుంటే ఉగగాది తరవాత కేంద్రానికి చేదు అనుభవమేమిటో రుచి చూపిస్తామని తెలంగాణ మంత్రులు ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ ధాన్యాన్ని కొనాల్సిందేనని, ఇందులో ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌,వేముల ప్రశాంతరెడ్డి,పువ్వాడ అజయ్‌ కుమార్‌లు ప్రకటించారు. పంటలు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం వీరు విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వడ్లు కొనాలని ఎన్నిసార్లు విన్నవించనా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని, రా రైస్‌ మాత్రమే కొంటామని కేంద్రం చెబుతోందన్నారు. తెలంగాణలో పండిన యాసంగి వడ్లు రా రైస్‌ కి పనిరావని, బాయిల్‌ చేయకుంటే నూకలు అవుతాయని చెబితే కేంద్రం వినడంలేదన్నారు. కావాలంటే విూ ప్రజలకు అవే నూకలు అలవాటు చేయాలని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందన్నారు. తెలంగాణ అంటే ఎందుకంత చిన్నచూపు అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని అవమానించిన వాళ్ళు చరిత్ర పుటల్లో కలిసిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానించిన వారు రాజకీయంగా జాడ లేంకుండా పోయారన్నారు. గతంలో రూపాయి కూడా ఇవ్వలేదన్న మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడడ్‌ఇ ఏమయ్యోడో గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్రం ఇంత ఘోరంగా అవమానిస్తుంటే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తామని చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ విూద, కేసీఆర్‌ విూద విషం గక్కుతున్నారని ఆరోపించారు. రైతుల గురించి కేంద్రం ఏమాత్రం ఆలోచించడంలేదని, తెలంగాణ రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేంద్రానికి ముందు చూపులేదని, పాలన చేతకాకపోతే దిగిపోవాలన్నారు. కేంద్రం స్పందించకుంటే ఉగాది తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని, అందుకు రైతులు సిద్ధంగా ఉండాలని కోరారు. అలాగే కెసిఆర్‌ రైతులకు రోణ కవచంగా ఉంటారని వారు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కూడా నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదని ఆక్షేపించారు. మంత్రి కిషన్‌ రెడ్డి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కేసీఆరే రైతులకు రక్షణ కవచం అని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల ఉసురుపోసుకున్న సర్కార్లు నిలవలేక పోయానని తెలిపారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని నిరంజన్‌ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణను అవమానించిన, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్‌ లేకుండా పోయారు. చరిత్రపుటల్లో కప్పివేయబడ్డారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్టాన్రికి ఎటువంటి సహకారం లేదన్నారు. దశాబ్దాల పెండిరగ్‌ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశామని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని గుర్తించి, ఈ రంగం విూద దృష్టి సారించారని తెలిపారు. దేశంలో పండిరచిన వ్యవసాయ పంటలను కొనే బాధ్యత కేంద్రానిదే అని నిరంజన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా లేకి మాటలు మాట్లాడుతున్నారు. హుందాతనం ప్రదర్శించట్లేదు. చచ్చేవరకు కేంద్ర మంత్రి పదవిలోనే ఉంటావా? అని కిషన్‌ రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని నీ ఆత్మ చెప్పట్లేదా? తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వడ్లు తీసుకోవాలని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదు. మా వినతిపత్రాలను కనీసం చదవకుండా.. తెలంగాణపై విషం కక్కుతారు. యజమాని బానిసతో మాట్లాడినట్లు కేంద్రం వ్యవహారం ఉందన్నారు. యూపీఎ హయాంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించారని మంత్రి గుర్తు చేశారు. ఈ రోజు కేంద్రం మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాలానుగుణంగా కేంద్రం మారడం లేదు.. రైతుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. ఇథనాల్‌ తయారీ వైపు ఎందుకు దృష్టి సారించడం లేదు.. గతంలో విూరే దానికి జై కొట్టారని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం మేం ఎన్ని అవమానాలైన భరిస్తాం.. కానీ సమయం వచ్చినప్పుడు తెలంగాణ బదులు తీర్చుకుంటుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉంది.. ఇంత పెద్ద భారతదేశంలో రాష్టాల్రతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 1 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జడ్పీలలో కేంద్రం వడ్లు కొనాలని తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని మంత్రి తెలిపారు. కేంద్రం మార్గాలు వెతకాలి. కాలానుగుణంగా మార్పులు రావాలి. ఇథనాల్‌ ప్రొడక్షన్‌ 2025 నాటికి 20 శాతం పెంచుతామన్నారు. ఇప్పటి వరకూ 5శాతం దాటలేదు. గోదాములు ఖాళీ లేవంటున్న కేంద్రం… ఎందుకు ఖాళీ చేయడం లేదు. ప్రజలకు బియ్యాన్ని పంచరెం దుకు?. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు లేవు. 28, 29న సార్వత్రిక సమ్మె చేస్తాం. ఉగాది తర్వాత ఉదృతమైన ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయింది. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయం. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని’ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు పీయూష్‌ గోయల్‌ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కిషన్‌ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి.. ఒక్కసారైనా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. ’కేంద్రం కావాలనే తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తోంది. మెడవిూద కత్తి పెడితే రైతుల ప్రయోజనాల కోసం.. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని రాసిచ్చాం. కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాలని 16సార్లు లెటర్లు రాశాం. నెలకు 10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రానికి పంపగలం.. తీసుకెళ్లమంటే మా దగ్గర ర్యాకులు లేవని వాళ్లే అన్నారు. పైగా సమయానికి సప్లై చేయడం లేదని అభాండాలు వేస్తున్నారు. మేం చేసిన
ప్రయత్నాలన్నీ కిషన్‌ రెడ్డికి తెలిసేలా లెటర్లు పంపిస్తాం. వాటిని చూసి అయినా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నించాలని కోరుతున్నాం’ అని మంత్రి గంగుల అన్నారు. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్‌ రెండు వరకు కేంద్రం స్పందన కోసం చూస్తామని… ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నా రన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.