ఆందోళనలతో అట్టుడికించిన వామపక్షాలు

అనేక సమస్యలపై పోరుబాటు
విభజన తరవాత ఊపందుకున్న లెఫ్ట్‌ కార్యకలాపాలు
విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఈ ఏడాది విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరిగాయి. వామపక్షాలతో పాటు దాని అనుబంధ సంఘాలు కూడా వివిధ సమస్యలపై గళమెత్తాయి. అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడంతో పాటు ప్రత్యక్ష ఆందోళనలకు దిగాయి. దీంతో విజయవాడ కేంద్రంగా మరోమారు వామపక్షాల్లో ఊపు కనిపించింది. రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా శుక్రవరాం ఆందోళన చేపట్టారు.  ఉమ్మడి ఎపిలో కూడా ఇంతగా ఆందోళనలు జరిగిన దాఖలాలు లేవు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులకు నష్టం చేకూర్చే 279 జివోకు వ్యతిరేకంగా, ఆశ వర్కర్లకు ద్దతుగా, ఆటో కార్మికులకు కనీస వేతనాల అమలు కోసం, కాంట్రాక్ట్‌,ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనాల అమలు తదితర అంశాలపై గట్టిగానే పోరాడారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో పలు సందర్భాల్లో ఆందోళన నిర్వహించారు. విజయవాడ నగరంలో నివాస ప్రాంతాల్లో బార్‌ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఐద్వా, పిఒడబ్ల్యు, ఎన్‌ఎఫ్‌ఐ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ప్రధానంగా ఇళ్ల మధ్య వైన్‌, బారు షాపులు ఎత్తేయాలన్న డిమాండ్‌తో మహిళలు చేపట్టిన ఆందోళన ప్రభుత్వాన్ని కదిలించింది. ప్రతిపక్ష సిపిఎం, సిపిఐ, వైసిపిలు రాష్ట్ర విభజన హామిల అమలు, నవ్యాంధ్రకు ప్రత్యేక ¬దా సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమించాయి. సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీలు ఈ కాలంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలకు రిజిస్టేష్రన్‌ సౌకర్యం
కల్పించాలని ఆందోళనకు దిగాయి. చెత్త డంపిగ్‌ యార్డులోని చెత్త తరలించాలని సిపిఎం ప్రత్యేకంగా ఆందోళన నిర్వహించింది. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రాలు అందించారు. వీరి పోరాటం ఫలితంగానే  ప్రభుత్వం 279లో కార్మికులకు నష్టం చేకూర్చే నిబంధనలను తీసివేసింది. ప్రభుత్వ జిఒలకు అనుగుణంగా వేతనాలు పెంపుపైన ప్రభుత్వం హామి ఇవ్వడంతో నిరవధిక సమ్మెను విరమించారు. కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఆటోనగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలని పలు సందర్బాల్లో ఆందోళనలు నిర్వహంచారు. ఆశ వర్కర్లకు తెలంగాణాలో ఇచ్చిన విధంగా కనీస వేతనం రూ.6 వేలు ఇవ్వాలని, పెండింగ్‌ యూనిఫాం అలవెన్స్‌లు ఇవ్వాలని, అర్హులైన ఆశలకు శిక్షణ ఇచ్చి రెండో ఎఎన్‌ఎంలుగా తీసుకోవాలని, పారితోషికాలు ఏ నెలలో ఎంత చెల్లించారో తెలుపుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టాలని డిమాండ్లతో  చలో అసెంబ్లీ నిర్వహించారు. అక్టోబర్‌లో కలెక్టరేట్‌ల ముట్టడి, అగస్టులో చలో డిల్లీ కార్యక్రమాలను నిర్వహించారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులుకు కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.  మిడ్‌ డే విూల్స్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ రెండు రోజుల నిరాహార దీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి చెందిన గన్నవరంలోని జోనల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి నిరసగా
ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఎంఎ/-లాయిస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌లు ఆందోళనలు నిర్వహించాయి. కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని, అద్దె బస్సుల స్థానంలో ఆర్టీసీ సంస్థ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ప్రభుత్వం బడ్జెట్లో ఆర్టీసీకి ప్రత్యే నిధులు కేటాయించాలని ఆందోళనలు నిర్వహించారు. భూ సేకరణ చట్ట సవరణకు నిరసనగా, ఉపాది కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ధర్నాలు నిర్వహించారు.