ఆందోళనలను అర్థం చేసుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల జీవితాలతో చెలగాటమాడేలా ఉన్న జీవో 279 రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పోలా రామాంజినేయులు డిమాండ్‌ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలన్నారు. జీవో 279ని రద్దు చేయాలని ఎన్నిసార్లు ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులందరికీ కనీస వేతనాలు, భద్రతా సౌకర్యాలు, పనిముట్లు సకాలంలో అందజేయాలన్నారు. హెల్త్‌ కార్డులు తదితర హావిూలను ప్రభుత్వం రాత పూర్వంగా హావిూ ఇచ్చిందన్నారు. హావిూ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఏఒక్క హావిూ నెరవేర్చలేదన్నారు.
స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల స్వపరిపాలనను తుంగలో తొక్కి కార్పొరేట్‌ సంస్థలకు గుత్తాధికారం కట్టబెట్టేందుకే 279 జీవో తీసుకువచ్చిందన్నారు. దీనిని రద్దు చేసి జీవో నెంబరు 151 ప్రకారం కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు.