ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియమితుల య్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన పదవి కాలం మరో 16 నెలలు ఉన్నప్పటికీ ఆకస్మత్తుగా బదిలీ చేసి జీడీఏలో రిపోర్టు చేయాలని ఆదేశించడం పోలీసు వర్గాల్లో సంచలనం కలిగించింది. ఆయన కేంద్ర సర్వీస్‌లోకి వెళ్తారని అందరూ భావించారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ సాధన కోసం చలో విజయవాడను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు వేలాదిగా విజయవాడకు తరలిరావడంతో ప్రభుత్వం విస్మయం చెందింది. ఉద్యోగులు విజయవాడకు రాకుండా కట్టడిలో విఫలం చెందడంతో పాటు పోలీసు నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిందని భావించిన ఏపీ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్‌పై బదిలి వేటు వేసిందని సర్వత్ర విమర్శలు వచ్చాయి. ఈ దశలో ప్రభుత్వంపై పడ్డ మరకను తొలగించుకునేందుకు ఆయనను మళ్లీ ఏపీకి తీసుకొస్తు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.