ఆంధ్రాలో ఘోరం

4

– కల్తీ మద్యం కాటుకు ఐదుగురు మృతి

విజయవాడ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): కృష్ణా జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరుచికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఐదుగురుమృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.   స్థానికంగా నిర్వహిస్తున్న స్వర్ణవైన్స్‌ దుకాణంలో సోమవారం  ఉదయం సుమారు 20 మంది కూలీలు మద్యం తాగారు. కొద్దిసేపటికి వీరిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కల్తీ మద్యం ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయవాడ బాం లో మద్యం సేవించిన వారిలో ముగ్గురు మరణించగా మరో పన్నెండు మంది తీవ్రంగా అస్వస్థులు అయ్యారని అన్నారు. విజయవాడ లోని కృష్ణ లంక వద్ద స్వర్ణ బాం లో ఈ ఘటన జరిగింది. పలువురి పరిస్థితి తీవ్రంగా ఉందని,ఆరుగురు విషమ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఈ బాం కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సంబందించిందని చెబుతున్నారు. వెంటనే అదికారులు అక్కడ కువెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మద్యం శాంపిల్స్‌ ను సేకరించి పరీక్షకు పంపుతున్నారు.దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు అన్నారు. ఉదయం మద్యం సేవించి పనులకు వెళ్లేవారు వెంటనే పడిపోవడం జరిగిందని చెబుతున్నారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు.బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌ తెలిపారు.  మరోవైపు మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాాం చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఘటనపై విచారణకు ఆదేశించిన చంద్రబాబు

కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనపై ఆంధప్రదేa ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కృష్ణా జిల్లా కలెక్టం ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, బాధితులకు సరైన వైద్యం అందించాలని కలెక్టంను ఆదేశించారు.. బాం ను సీజ్‌ చేశామని, లిక్కం ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ చేస్తున్నామని,  విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ శాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.  విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని భాజపా, వామపక్షాల కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాాం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతిచెందిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాన్నారు. మద్యం షాపు నిర్వాహకుల కక్కుర్తి వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్త చేసారు. కృష్ణలంకలో మూడు మద్యం దుకాణాలు ఉన్నాయని… ఈ ప్రాంతంలో అన్ని దుకాణాలు అవసరం లేదని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీనికి తోడు నూతన మద్యం విధానం పేరుతో ప్రభుత్వం మరిన్ని దుకాణాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

జగన్‌ తీవ్రగ్భ్భ్రాంతి

బెజవాడలో కల్తీ మద్యం ఘటనపై వైఎస్‌ఆం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాాం చేశారు. ఈ విషాద ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని వైఎస్‌ జగన్‌ డిమాాం చేశారు.  విజయవాడ స్వర్ణ బార్లో మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 15మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు కల్తీ మద్యం  సేవించి అస్వస్థతకు గురైన బాధితులను వైఎస్‌ఆం కాంగ్రెస్‌ పార్టీ నేత వంగవీటి రాధా పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన సోమవారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కల్తీ మద్యం బాధ్యులను వదలం: కొల్లు రవీంద్ర

విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనలో బాధ్యులు ఎంతటివారైనా విడిచిపెట్టేదిలేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడ్తామన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు అస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టం బాబు.ఎ, ఎమ్మెల్యే గ్దదె రామ్మోహన్‌, కమిషనం గౌతమ్‌ సవాంస్త్ర తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.  కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. స్థానికంగా నిర్వహిస్తున్న స్వర్ణవైన్స్‌ దుకాణంలో ఈరోజు ఉదయం సుమారు 20 మంది కూలీలు మద్యం తాగారు. కొద్దిసేపటికి వీరిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. పలువురి ఆరోగ్య పరి/థసితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల్లో సురభి నాగబాబు, ఎం.శంకం, సన్యాసిరావు, సైదా, అక్కునాయుడు, వెంకట గోపీకృష్ణ, బయ్యా, గంగుశ్రీను, విజ్జీవెంకటరావు, విూసాల సాహెబ్‌, బాషిరెడ్డి, సత్యం, గురుస్వామి, యాకూబ్‌లు ఉన్నట్లు గుర్తించారు.