ఆకట్టుకున్న అఖండ భజనలు .

అయ్యప్ప సంకీర్తనలతో మారుమోగిన అయ్యప్పనగర్ వీధులు.
తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాండూరు అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన ‘ని గానం నా ప్రాణం’ అఖండ భజనలు అందర్నీ ఆకట్టుకు న్నాయి. సమితి జాతీయ అధ్యక్షులు రాజ్ దేశ్పాండే కాషాయ ధ్వజారోహణ, గో పూజలు నిర్వహించి భజనలను ప్రారంభించా రు. జిల్లాలోని పదికి పైగా మండలాల నుంచి వచ్చిన భజనమండలి బృందాలు ఏకధాటిగా అయ్యప్ప భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించా రు.జిల్లాలో తొలిసారిగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అఖండ భజనలునిర్వహించ డం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పీ. మహేందర్రె
డ్డి మున్సిపల్ చైర్మన్ స్వప్న సాయి పుత్ర హోం అధినేత శంకర్యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ లను సమితి జిల్లా అధ్యక్షులు బాకారం జైపాల్రెడ్డి, గౌరవాధ్యక్షుడు బస్వరాజ్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్రెడ్డి ఆలయ సంఘ అధ్యక్షులు వేంకట్రావు ప్రధానకార్యదర్శి కేశవరెడ్డి, కోశాధికారి మనోహర్ యాదవ్ నవీన్కుమార్ ఘనంగా సన్మానించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో సమితి జిల్లా ప్రచార కార్యదర్శి కొంపల్లి రమేష్ తాండ్ర రమేష్ సంతోష్ ను అన్నదానం, అల్పాహార వితరణ చేసారు.