ఆటోను ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి

బాధతులు పెద్దేముల్ వాసులు
ధారూర్‌,వికారాబాద్‌ జిల్లా ధారూర్ మండలంలోని కేరెళ్లి – బాచారం వద్ద ఆటోను లారీ ఢీ కోనడంతో ఘోర ప్రమాదం చోటు జరిగింది. ఈప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండా నుండి ఆటోలో కూలీలను తీసుక వస్తుండగా ధారూరు మండలం కేరెళ్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు వారి నీ పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు పలువురి పరిస్థితి అడిగి తెలుసుకున్నా మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, మృతుల్లో బాధితులంతా పెద్దేముల్‌ మండలం మదనంతాపూర్‌ గ్రామానికి చేరుకుని మరణించిన కుటుంబ సభ్యులకు పరామర్శించదానికి వెళ్తున్న మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎమ్మెల్సీ గారితో చెప్పడం జరిగింది.

ఈ రోజు బాచారం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి ఎప్పటికప్పుడు చరవాణి (ఫోన్) లో అడిగి తెలుసుకుంటున్న వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్
ఎమ్మెల్యే మునుగోడు ఎన్నికలలో భాగంగా మునుగోడు లో ఉన్నందున, రాలేకపోయారు. ఈ రోజు బాచారం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు చరవాణి (ఫోన్) లో క్షతగాత్రుల ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు