ఆటోను ఢీకొన్న బొలెరో: పలువురికి గాయాలు
కర్నూలు,సెప్టెంబర్4(జనం సాక్షి): తంగడంచ గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను, అదే రోడ్డుపై వస్తున్న మహారాష్ట్రకు చెందిన బలెరొ వాహనం ఢీకొంది. ఆటోను ఢీకొన్న బలెరో వాహనం కూడా పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా, ముగ్గురికి కాళ్లు, చేతులు విరిగినట్లు సమాచారం. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.