ఆటో డ్రైవర్ ను 1000రూ. ఇవ్వాలంటూ కానిస్టేబుల్ డిమాండ్…

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ లో కానిస్టేబుల్ రచ్చ రచ్చ చేశాడు.. ఆటో పై అవసరం లేని విరాంగం సృష్టించాడు.. సిగ్నల్ జంప్ చేస్తావా.. గంధం చెక్కల ఎక్కడ తీసుకెళ్తున్నావ్.. అంటూ నా నా హంగామా చేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే చిన్న శంకరం పేట మండలం మాందా పూర్ కు చెందిన చంద్ర పాల్ సాయి దీప్ కిరణం నుంచి బొగ్గు, మరో చోటు నుంచి కట్టెలను ఆటో లో వెళ్తున్నాడు.. రామ్ దాస్ చౌరస్తా వద్ద నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏ అర్ కానిస్టేబుల్ ఆటో ముందుకు వచ్చి డ్రైవర్ ను కొట్టాడు.. సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా వెళ్తావా అంటూ ప్రశ్నిస్తూ.. ఆటోలో ఏమి తీసుకెళ్తున్నావ్ అని అడగగా బొగ్గు, కట్టెలు ఉన్నట్లు చెప్పాడు.. గంధం కట్టెలు ఎక్కడ తీసుకెళ్తున్నావ్ అని సంబంధం లేని ప్రశ్నించడం తో సదరు డ్రైవర్ ఒకసారి కంగుతిన్నాడు.. ఏమిటి సార్.. ఇవ్వీ మామూలు కట్టెలు మాత్రమే.. అంటున్న. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు..కానిస్టేబుల్ వ్యవహారం అర్థమై అందుకు సార్ ఇదంతా అంటే వెయ్యి రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేయగా డ్రైవర్ ఎందుకు ఇవాలి అని దీనంగా ప్రశ్నించాడు. గంధం చెక్కలు తీసుకెళ్తున్నావ్ కదా అన్నట్లు ఆగ్రహంగా అన్నాడు. కానిస్టేబుల్ వ్యవహార శైలి, ఇష్టానుసారంగా ప్రవరత్తున్న తీరు చూసిన వారు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది  అని అన్నారు . డ్రైవర్ తో కానిస్టేబుల్ వ్యవహరిస్తున్న తీరును మొబైల్ ఫోన్ లో స్థానికులు చిత్రీకరించారు. ఆ కానిస్టేబుల్ గతం లో కూడా సస్పెండ్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమచారం. నిబంధన ప్రకారం సిగ్నల్ జంప్ అయిన ఫోటో తీసి ఫైన్ పంపాల్సి ఉంటుంది. కానీ వాహనాన్ని నిలిపి డబ్బులు డిమాండ్ చేయవద్దని పై అధికారులు చెబుతున్నా కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం,. మదు సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ పట్ల కానిస్టేబుల్ రఘుపతి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియోలు తనకు వచ్చాయని, దీని పై ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకువెళతాను అని చెప్పారు.