ఆటో స్టాండ్ వద్ద కోళ్ల దుకాణం ఎత్తివేయాలి.
– బెల్లంపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్ట రామ్ కుమార్.
బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని రూరల్ ఆటో స్టాండ్ వద్ద ఉన్న కోళ్ల దుకాణంను ఎత్తివేయాలని బెల్లంపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్ట రామ్ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణం నుండి భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు బెల్లంపల్లి పట్టణం నుంచి రోజుకు 300 ఆటోలు వేలాది మంది ప్రయాణికులను ఆటోల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయన్నారు. బెల్లంపల్లి పట్టణం నుంచి ఐదు మండలాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఆటోడ్రైవర్లకు బెల్లంపల్లి మంచిర్యాలకు వెళుతున్న బస్ స్టాప్ లో ఉన్న ప్రయాణికులకు ఆటో స్టాండ్ మధ్యలో మరియు బస్ స్టాప్ ముందు కోళ్ల వ్యాన్లు, కోళ్ల దుకాణం పెట్టడం వల్ల కోళ్ల దుర్వాసనతో ప్రజలు, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కోళ్లు ఇక్కడ పెట్టకూడదు అని అడిగితే ఆటో డ్రైవర్ల పై దాడులకు దిగుతూ, మీ దిక్కున చోట చెప్పుకోండి అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని, రెండు సంవత్సరాల క్రితం కూరగాయల మార్కెట్లో ఉన్న కోళ్ల దుకాణం కూరగాయల మార్కెట్ పనుల నిమిత్తం అక్కడ తీసివేయడంతో కొన్ని రోజుల వరకు మీ యొక్క ఆటో స్టాండ్ మధ్యలో నా యొక్క షాపు ఉన్నందున అందులో కొన్ని కోళ్లు పెట్టుకుంటాను అని ఆటో డ్రైవర్లను సంప్రదించి పెట్టుకొని, ఈరోజు మీరు ఎక్కడి వాళ్ళు వెళ్లిపోండి అని ఈ స్థలం మొత్తం నాదే అంటూ మీరు పొద్దుట వచ్చి సాయంత్రం వెళ్ళిపోవాలి అని హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు ఇక్కడి స్థలాన్ని పరిశీలించిన తరువాత ఆటో స్టాండ్ల మధ్యలో ఉన్న కోళ్ల దుకాణం తీయించి ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరారు.