ఆత్మకూర్ లో మల్లన్న 7200 టీమ్ లో భారీగా చేరికలు
కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా కన్వీనర్ బద్ధుల సునీతఆత్మకూర్(ఎం) నవంబర్ 2 (జనంసాక్షి) సమాజం కోసం పనిచేస్తూ ప్రశ్నించే వారికి తీన్మార్ మల్లన్న టీమ్ 7200 మూమెంట్ మంచి వేదిక అని తీన్మార్ మల్లన్న టీమ్ యాదాద్రి జిల్లా కన్వీనర్ బద్ధుల సునీత అన్నారు మండల కేంద్రంలో రమేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా బద్ధుల సునీత కోకన్వీనర్ రామకృష్ణారెడ్డి సమక్షంలో 7200 టీమ్ లోకి యువకులు భారీగా చేరారు సునీత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం సునీత మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం యువత నిజాయితీగా పనిచేయాలని పిలుపునిచ్చారు సమ సమాజ స్థాపనకు ప్రశ్నించే యువత పాత్ర కీలకమని తెలిపారు ఉచిత విద్య ఉచిత వైద్యం సత్వర న్యాయం కోసం మొదలు పెట్టిన 7200 మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు టీమ్ లో చేరిన యువకులు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం పనిచేసే వాళ్లకు 7200 మంచి వేదికని టీమ్ లో జాయిన్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అనంతరం మండల కమిటీ వేశారు మండల కన్వీనర్ గా మాద రమేష్ కోకన్వీనర్ గా చిక్కిడి వెంకటేష్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ కుమార్ నాగిరెడ్డి గణేష్ సిద్దిరెడ్డి నవీన్ ప్రశాంత్ శేఖర్ వెంకన్న మధు సూర్యప్రకాష్ శ్రీధర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు