ఆత్మబలిదానాలు వద్దు..
ఆదిలాబాద్, డిసెంబర్ 7 : ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఏ ఒక్కరూ కూడా ఆత్మబలిదానాలను పాల్పడవద్దని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్మల్ నియోజకవార్గంలోని పలు గ్రామాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టిడిపి, కాంగ్రెస్‌లు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఐక్యంగా పోరాడిన, వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నా కేంద్రంలో చలనం లేదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.