ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీవర్షం

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజనగర్‌ మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని రాజ్‌పల్లి, బారేగూడ, పోతెపల్లి వాగులు ఉపొంగుతున్నాయి. వాగులపై వంతెనలు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని కృష్ణానగర్‌ కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చిచేరింది.