ఆదివాసీ కాంగ్రెస్ ధర్నా ఆధ్వర్యంలో గాంధీ భవన్ దగ్గర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 నాడు అతికిరాతకంగా గిరిజన మహిళ అయినా లక్ష్మీబాయిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టి, రాత్రి మూడు గంటలు పోలీసు జీపులోనే ఉంచారు. బాధిత మహిళ లక్ష్మి యొక్క బాధ వర్ణనాతీతం. పోలీసుల జులుంకు, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధిత మహిళకు న్యాయం చేయాలని బాధిత మహిళ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు డబుల్ బెడ్ రూమ్, 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అతి కిరాతకంగా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసాధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్, నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ భరత్ చౌహన్ ఖైరతాబాద్ జిల్లా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ ధనరాజు గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరాథోడ్ గారు, ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు బల్లు గారు, చవాన్ లక్ష్మి బాయి,రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.