ఆదివాసీ దళితహక్కుల సాదనకై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా

ఆదివాసీ దళితహక్కుల సాదనకై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా

రాయికల్(జనంసాక్షి)
రాజ్యాంగపరమైన ఆదివాసి హక్కులను అమలుపరచాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కురుసెంగ వేణు మాట్లాడుతూ ఆదివాసి హక్కులను కాలరాస్తున్నారని, సక్రమంగా చట్టాలను అమలుపరచకుండా ఆదివాసి దళిత యాక్షన్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయి అని, ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని అన్నారు ఆదివాసీలకు అపూర్వమైన జల్ జంగల్ జమీన్ జన్నర్ హమారా అని కొట్లాడిన కొమురం భీమ్ వారసులకు డాక్టర్ బాబాసాహెబ్ ప్రసాదించిన వరాలు అందకపోవడం శోచనీయం అని ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో సంపూర్ణ గిరిజన సంక్షేమ శాఖ అమలుపరచకపోవడం, ఆదివాసీలకు నివాస స్థలాలు,వ్యవసాయ భూములు లేవని వేరేదారులు లేక దీనస్థితిలో గుడారాలలో జీవిస్తున్నమని,తాగునీరు, సాగునీరు,బడిబాట లాంటి సౌకర్యాలు లేక ఇంకా కూలీలుగానే జీవనం సాగిస్తున్నామని దీనికి తోడు నకిలీ సర్టిఫికెట్లతో తయారవుతున్న నకిలీ ఎస్టీ సర్టిఫికేట్లతో కొనసాగుతున్న వ్యక్తులపై ముఖ్యంగా రామగులపై చర్య తీసుకోవాలని,సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించి,మా హక్కులని విధిగా అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఢిల్లీలో వీరితోపాటు ఆదివాసి తోటి జాతి ఉద్యోగుల సంఘం నాయకులు కురిసెంగ శ్రీనివాస్,ఆత్రం రఘునాథం,టీచర్ మాడావిశంకర్, కురిసెంగ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.