ఆదివాసీ పోడు భూముల సమస్య పై కలెక్టర్ ని కలిసిన ఎం ఎల్ ఎ సండ్ర
పెనుబల్లి మండలం రామచం ద్రాపురం గ్రామ ఆదివాసీల భూసమస్య పైసోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరు వి పి గౌతంని నాయకులు లక్కినేని వినీల్, మండదపు అశోక్ తొ సత్తుపల్లి ఎం ఎల్ ఎ సండ్రవెంకటవీరయ్య కలిశారు. రామచంద్రాపురం గ్రామంలో ఆదివాసుల పోడు భూములను అక్రమంగా ఆక్రమించుకొని బినామీ పేర్లతో ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసుల భూములను సుమారు 9 మంది ఆదివాసుల పేర అటవీ హక్కుల పత్రాలు చేయించుకొని సుమారు 72 మంది పోడు రైతుల భూములను అన్యాక్రాంతం చేసిన వ్యక్తి పై తగిన విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ఆదివాసీలతో, సండ్ర ఖమ్మం కలెక్టరేట్ లో కలెక్టర్ ని కలిసి కోరారు. ఈ ఆదివాసీలకు అటవీ హక్కుల చట్ట ప్రకారం 1980 నుంచి ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నటువంటి 72 మంది రైతులకు 74 ఎకరాలకు సంబంధించిన భూమిని సమానంగా పంచి వ్యక్తిగత హక్కు పత్రాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరక్షరాసులమైన ఆదివాసులను పోడు భూముల విషయంలోనూ రెవిన్యూ భూముల విషయంలోనూ అక్కడ జరిగిన అవకతవకలను న్యాయం చేయుట కోసం ప్రత్యేకించి కేవలం అక్కడ ఉన్న ఆదివాసుల కోసం మాత్రమే ప్రత్యేక గ్రామసభను తక్షణమే ఏర్పాటు చేయాలని సండ్ర వెంకట వీరయ్య కలెక్టర్ ని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మండలాల్లోని ఆయా గ్రామాల్లో రెవిన్యూ సంబంధిత సమస్యల గల ప్రజలతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలెక్టర్ని కలసి పరిష్కరించవలసిందిగా కోరారు.