ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం కచ్చితంగా ఉండాలి.
మద్దతు ధరలు…చనిపోయిన రైతులు
ఈ రెండు సమస్యలపై పెదవి విప్పని కేంద్రం
వీటిపై ఎలాంటి స్పష్టత ఇస్తారో అని రైతుల చూపు
న్యూఢల్లీి,నవంబర్23 (జనం సాక్షి ): మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఆందోళన చేస్తున్న రైతులను బిజెపి నాయకులు జాతి వ్యతిరేక శక్తులుగా అభివర్ణించాయి. చట్టాలు రద్దు అవుతున్ననేపథ్యంలో గతంలో చేసిన వ్యాఖ్యలను బిజెపినేతలు ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలి. అలాగే రైతులు తమ సమస్యలపై నిలదీస్తున్నారు. ప్రధానంగా మద్దతుధరలు,చనిపోయినప వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడం ముఖ్యం. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయించినట్టు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం ద్వారా బిజెపికి రైతుల పట్ల అపారమైన గౌరవం ఉన్నట్టు ప్రదర్శించారు. ఈ వ్యవసాయ చట్టాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయని రైతులందరికీ నచ్చచెప్పలేకపోయాం అని అంటూ దీని వల్లనే ఈ చట్టాలను ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు.. సాగుచట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడానికి ముందు రైతులకు నచ్చచెప్పాలన్న ఆలోచన ప్రధాని మాటల్లో ఎక్కడా కనిపించలేదు. అయితే మద్దతు ధరలు, చనిపిఓయిన వారి కుటుంబాలను ఆదుకోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీి సరిహద్దులలో, ఇతర రాష్టాల్ల్రో రైతులు గొంతెత్తిన సందర్భంగా బిజెపి నాయకులు వారిని రెచ్చగొట్టారు, ఎదురుదాడి చేశారు, బెదిరించారు. ఆందోళన చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యానాల జాబితా ను గమనిస్తే అవి మోడీ ప్రకటనకు భిన్నంగా ఉన్నాయి. వారంతా ఖలిస్తాన్ వాదులు అంటూ విమర్వలు గుప్పించారు. విదేశీ శక్తుల కుట్ర అంటూ కొట్టి పారేశారు. వారసలు రైతులే కాదన్న వితండవాదం తీసుకుని వచ్చారు. స్వార్ధ ప్రయోజనాలతోనే వీరు ఆందోళన చేస్తున్నారని, ఆందోళన చేస్తున్న వీరు అసలు రైతులే కాదని ఆందోళన చేస్తున్న రైతుల గురించి వ్యాఖ్యానాలు చేశారు. లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అషిశ్ మిశ్రా హింసాత్మక చర్యలకు పాల్పడినా చర్యలు లేవు. కారు ఆందోళన చేస్తున్న రైతులపైకి ఎక్కించిన సందర్భంగా నలుగురు రైతులు మరణించారు. దీనికి బాధ్యుడైన అషిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేయగా, అతని తండ్రి అజయ్ మిశ్రా మోడీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనను నీరుకార్చడానికి బిజెపి నాయకులు వారిని ’ఖలిస్తాన్’ తీవ్రవాదులతో పోలుస్తూ, వారికి భారత దేశం వెలుపల నుంచి మద్దతు లభిస్తోందని ఆరోపించారు. రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన బిజెపి పార్లమెంటు సభ్యుడు జస్కౌర్ విూనా ఆందోళనాకారుల చేతిలో ఎకె47 తుపాకులున్నాయని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించాశారు. రైతుల ఆందోళనకు ఢల్లీి ముఖ్యమంత్రి కేజీవ్రాల్ మద్దతు తెలపడంతో ఆయన ఢల్లీి నగరాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు గూండాలు అని బిజెపి నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు మొత్తం భారత దేశానికి సంబంధించినవైనప్పుడు వారి ఆందోళన పంజాబ్‌కు మాత్రమే ఎందుకు పరిమితమైందని కూడా ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్నవారు ఖలిస్థాన్ జిందాబాద్, పాకిస్థాన్ జిందాబాద్ అని ఎందు కు నినాదాలు చేశారు? అని కూడా అన్నారు. జరుగుతున్న ఆందోళనలో ఉన్నది నిజానికి రైతులు కాదు. దానిలోకి లెప్టిస్టులు, మావోయిస్టులు చొరబడ్డారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నది రైతుల సమస్యల పరిష్కారం కోసం కాదు. ప్రభుత్వం అరెస్టు చేసిన ’ జాతి వ్యతిరేక శక్తుల’ విడుదల కోసం ఆందోళన చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ల్గªతుల ఆందోళనను తగ్గించడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇతర బిజెపి నాయకులతో గొంతు కలుపుతూ, రైతుల ఉద్యమాన్ని చిన్నచిన్న ముఠాలు స్వాధీనం చేసుకున్నాయని అన్నారు. తప్పుడు రూపకల్పన చేసేవారు దీనిలోకి ప్రవేశించారు. అందుకే రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాని వ్యాఖ్యానించారు. అయినా వారు పట్టువీడకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.