*ఆధునిక నాగరికత లో ఆటవిక చర్యలు,*
*బెస్తగూడెం (కొమరం భీం)ఆదివాసీ గూడెంపై గ్రామ బహిష్కరణ,*
*మా జీవితాలపై ఆంక్షలు విధించి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తుల పై ఫిర్యాదు,*
*అదివాసులపై చిన్న చూపుతో పట్టించుకోని అధికారులు,*
వెంకటాపురం (నూగురు)ఆగస్టు13 జనంసాక్షి :
ఆదివాసులమైన మమ్ములను మాకు కూలి, తినడానికి తిండి, మా పిల్లల చదువు, వైద్యం అందకుండా చేస్తూ మమ్ములను గ్రామ బహిష్కరణ చేసినటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ఆదివాసులు ఫిర్యాదు చేశారు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం (కొమరం భీం) కాలనీ ఆదివాసి కుటుంబాలపై బెస్తగూడెం గిరిజనేతరులు గ్రామ బహిష్కరణ చేసి వారు కూలి పనులకు వెళ్లకుండా పిల్లలు చదువు విద్య ,వైద్యం వారికి అందకుండా కఠిన ఆంక్షలు విధిస్తూ వారిపై భౌతిక దాడులు చేస్తూ ఆదివాసుల జీవనానికి అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ వారి బతుకులును చిన్నాభిన్నం చేస్తున్నారని ఆదివాసులు ఆవేదన చెందుతున్నారు, మమ్ములను ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేస్తున్న గిరిజనేతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు,
ఆధునిక యుగంలో ఆటవిక చర్యలు,
ఆధునిక నాగరికతలో ఆటవిక చర్యలకు పాల్పడడం బెస్త గూడం గ్రామస్తులకు పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు, గతంలో బెస్తగూడెం గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్నారని వారి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు, దళిత విద్యార్థులను తమ పాఠశాలకు రావద్దంటూ అడ్డుకున్న సంఘటనలు కూడా ఈ గ్రామంలో జరిగాయి, అటువంటి ఆటవిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కేసులు నమోదైన కూడా వారిలో మార్పురావకపోవడం తో వారి ఆగడాలకు ప్రస్తుత అమాయక ఆదివాసులు బలవుతున్నారు, ఇకనైనా ఇటువంటి ఆటవిక చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారి చేత బాధింపబడే ప్రజలు, మానవతావాదులు కోరుతున్నారు